రణ్‌బీర్‌తో పెళ్లిపై అలియా రిప్లై

Alia Bhatt Says Ranbir And His Family Members Bring In Loads Of Positivity In Her - Sakshi

ముంబై : బాలీవుడ్‌ భామ అలియా భట్‌, నటుడు రణ్‌బీర్‌ కపూర్‌లు ఏడాదిగా డేటింగ్‌లో ఉండగా, తాజాగా వారి అనుబంధంపై అలియా భట్‌ స్పందించారు. తమకు వివాహం చేసుకునే ఆలోచన ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. తన జీవితంపై సానుకూల ప్రభావం చూపిన వారిని గుర్తుంచుకోవడం తన బాధ్యతని, వారిలో రణ్‌బీర్‌ కపూర్‌ ఒకరని అలియా భట్‌ చెప్పుకొచ్చారు.

ఇక తాను రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లి చేసుకుంటానని వచ్చిన ఊహాగానాలను అలియా తోసిపుచ్చుతూ తాము పెళ్లిచేసుకోవడం లేదని తేల్చిచెప్పారు. రణ్‌బీర్‌..ఆయన కుటుంబంపై తన జీవితంపై సానుకూల ప్రభావం చూపారని, రణ్‌బీర్‌ ఎప్పటికీ తన ఫేవరెట్‌ నటుడని, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతాడని అలియా చెప్పారు. రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌తోనూ తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని ఆమె వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top