ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

Alia Bhatt Is Playing a Guest Role In SS Rajamoulis RRR Movie - Sakshi

బాహుబలి చిత్రాలతో రాజమౌళి జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. బాహుబలి చిత్రం భారీ విజయం సాధించిన తరువాత.. ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ నెలకొంది. ఈ మూవీలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ మూవీలో అలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించనున్న విషయం తెలిసిందే. సీత పాత్రలో అలియా భట్‌ రామ్‌ చరణ్‌కు జోడిగా నటించనుండగా.. ఆమె పాత్రపై పలు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా పాత్ర కేవలం గెస్ట్‌ అప్పియరెన్స్‌లా ఉంటుందనే వార్తలు వైరల్‌ అవుతుండగా.. వాటిపై ఆమె స్పందించారు. కరణ్‌ జోహర్‌ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ, రాజమౌళి సినిమాలో నటించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో తన పాత్ర ఎంతసేపు ఉందనేది తనకు అనవసరమని, ఆయన సినిమాలో నటిస్తే చాలు అని అన్నారు. అలాగే తెలుగులో స్పష్టంగా మాట్లాడకపోవచ్చు కానీ ట్రై చేస్తానని, ఈ సినిమా కోసం తాను ప్రత్యేకంగా తెలుగు క్లాస్‌లు తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top