టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘సామజవరగమన’

Ala Vaikunthapurramuloo Song Promo From Trending in Youtube - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. గతంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సూపర్‌ హిట్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

అతి త్వరలో సామజవరగన అనే పాటను విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్ 20 సెకన్ల టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. డేట్‌ ప్రకటించకపోయినా అతి త్వరలో పూర్తి పాటను విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top