గిన్నిస్‌కు ఎక్కిన ‘బాస్’ | Akshay Kumar's Boss enters Guinness Book World Records for largest poster | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌కు ఎక్కిన ‘బాస్’

Oct 12 2013 1:58 AM | Updated on Apr 3 2019 6:23 PM

గిన్నిస్‌కు ఎక్కిన ‘బాస్’ - Sakshi

గిన్నిస్‌కు ఎక్కిన ‘బాస్’

ముంబై: అక్షయ్‌కుమార్ తాజా సినిమా బాస్ పోస్టర్ ఏకంగా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్‌ను తయారు చేసి అక్షయ్ అభిమానులు ఈ రికార్డు కొట్టేశారు.

ముంబై: అక్షయ్‌కుమార్ తాజా సినిమా బాస్ పోస్టర్ ఏకంగా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్‌ను తయారు చేసి అక్షయ్ అభిమానులు ఈ రికార్డు కొట్టేశారు. మైకేల్ జాక్సన్‌పై రూపొందిన ‘దిస్ ఈజ్ ఇట్’ సినిమా పోస్టర్‌కు కూడా గిన్నిస్ రికార్డు దక్కింది. 58.87 మీటర్ల వెడల్పు, 54.94 మీటర్ల ఎత్తై ఈ పోస్టర్‌ను ఈ నెల మూడున ఇంగ్లండ్‌లో అక్షయ్ అభిమానులు విడుదల చేశారు. పోస్టర్ రికార్డు సృష్టించడంపై అక్షయ్ హర్షం వ్యక్తం చేశాడు. 
 
సినిమా భారీ విజయం నమోదు చేయడం ఖాయమని చెప్పాడు. బాస్ ప్రతి సన్నివేశాన్నీ ప్రేక్షకులు ఆస్వాదించవచ్చని, దర్శకుడు అద్భుతంగా దీనిని తెరకెక్కిం చాడని ప్రశంసించాడు. దిస్ ఈజ్ ఇట్ పోస్టర్‌ను తయారు చేసిన ఇంగ్లండ్ కంపెనీ మాక్రో ఆర్ట్సే ఈ పోస్టర్‌నూ రూపొం దించింది. ఆం టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన బాస్‌లో మిథున్ చక్రవర్తి, డానీ డెంజోంగ్‌పా, అదితిరావు హైదరి, పరీక్షిత్ సహానీ ముఖ్యపాత్రలలో కనిపిస్తారు. ఇది ఈ శుక్రవారం విడుదలవుతోంది.
 
లాటిన్ అమెరికా వెళ్తున్న ‘బాస్’
బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా బాస్ సినిమాను లాటిన్ అమెరికాలోనూ విడుదల చేస్తున్నారు. లాటిన్ అమెరికాలో ఇది వరకు  హిందీ సినిమాలు ఎప్పుడూ విడుదల కాలేదు. పనామా, పెరూ, ఫ్రాన్స్‌లో విడుదల చేస్తామని పంపిణీ సంస్థ క్రియాన్ మీడియా తెలిపింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియాలోనూ 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కొత్త ప్రాంతాల్లో సినిమా పంపిణీ సవాల్ వంటిదేనని క్రియాన్ మీడియా ఉన్నతాధికారి రాజ్‌మాలిక్ చెప్పారు. అయితే హిందీసినిమాను తొలిసారిగా లాటిన అమెరికాలో విడుదల చేస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. లాటిన్ అమెరికాలోనూ మంచి వసూళ్లను సాధించగలమని రాజ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement