ఆకాష్ హీరోగా ‘ఆనందం మళ్లీ మొదలైంది’

ఆకాష్ హీరోగా ‘ఆనందం మళ్లీ మొదలైంది’

‘ఆనందం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఆకాష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. ఆకాషే ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్.జె.రత్నావత్ నిర్మాత. ఏంజల్‌సింగ్, సంజనా పాత్రో, రేఖ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎన్.శంకర్ క్లాప్ ఇచ్చారు. ‘‘నా తొలి సినిమా ‘ఆనందం’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంత హిట్ కాకపోయినా... ప్రేక్షకులను అలరిస్తుందని మాత్రం నా నమ్మకం.

 

  ‘ఆనందం’లో నటించిన చాలామంది ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. అసభ్యతకు తావులేని రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని ఆకాష్ చెప్పారు. ఆకాష్‌తో ‘స్వీట్‌హార్ట్’ చిత్రం తీశానని, మళ్లీ ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుమన్ జూపూడి, ఎడిటింగ్: మోహన్.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top