నేనెవరి చెప్పుచేతల్లో లేను!

Actress Priyanka Clarity On rumours In Social Media - Sakshi

తమిళసినిమా: నేను ఎవరి చెప్పుచేతల్లోనూ లేను అంటోంది నటి ప్రియాంక. ఆ మధ్య శ్రీ ప్రియాంకగా పేరు మార్చుకుని మళ్లీ అసలు పేరునే తిరిగి పెట్టుకుంది. ‘అగడం’చిత్రం ద్వారా నటి రంగప్రవేశం చేసిన పుదుచ్చేరి భామ ఇప్పుడిప్పుడే కథానాయకిగా ఎదుగుతోంది. ప్రియాంక గురించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. వాటికి స్పందింస్తూ ఈ అమ్మడు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఇటీవల పత్రికల్లో నాపై చాలా తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నటిగా నా ఎదుగుదలను చూసి గిట్టని వాళ్లే అలా దుష్ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. నిర్మాత, దర్శకుడు, మేనేజర్‌ లాంటి వారి చెప్పుచేతల్లో నేలేను.

సినిమాలు సాధించాలన్న లక్ష్యంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్వతంత్య్రం ఉన్న నటిని నేను. ఇప్పటి వరకూ వందామల, కోడైమళ, స్కెచ్, మిగ మిగ అవసరం, పిచ్చువాకత్తి తదితర 10 చిత్రాలకు పైగా నటించాను. త్వరలో నేను నటించిన జెస్సీ చిత్రం తెరపైకి రానుంది. ఇప్పటి వరకూ నా నటన, డ్యాన్స్‌ను ఎవరూ విమర్శించలేదు. ఇకపై కూడా అలానే ఉంటా. అవకాశాలు చాలా వస్తున్నా.. నా మనసుకు నచ్చిన.. ఎలాంటి విమర్శలకు తావులేని పాత్రలను ఎంచుకుంటున్నా. హీరో, చిత్ర బడ్జెట్‌ లాంటి ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కావడం లేదు. మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఇకపై తనకు సంబంధించిన వివరాలను పీఆర్‌ఓ శంకర్‌ ద్వారా తెలుసుకోవచ్చు’అని నటి ప్రియాంక పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top