ప్రెగ్నెన్సీ వదంతులపై స్పందించిన నటి

Actress Nikki Reed reveals facts about pregnancy

లాస్ ఏంజెలిస్ : తన ప్రెగ్నెన్సీ విషయంలో ప్రచారమైన వదంతులపై హాలీవుడ్ నటి నిక్కీ రీడ్ భగ్గుమన్నారు. పిల్లలు కావాలంటూ భర్త ఇయాన్ సోమర్‌హాల్డర్ తననెప్పుడూ బలవంతపెట్టలేదని స్పష్టం చేశారు. సోమర్‌హాల్డర్ పిల్లలకోసం ఆరాటపడుతున్నారని, కానీ నటి నిక్కీ మాత్రం గర్భనిరోధక మాత్రలు వాడారంటూ ఆమెపై దుష్ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మా ఇద్దరి నిర్ణయం మేరకే తాను తల్లిని కావాలని భావించినట్లు చెప్పారు. దయచేసి అలా లేనిపోని కథలు అల్లవద్దని ఆమె కోరారు.

మహిళలు, ముఖ్యంగా గర్భం దాల్చిన వారి విషయంలో సానుకూల ధోరణితో వ్యవహరించడం మంచిదంటూ తనపై కామెంట్లు చేసిన వారికి నిక్కీ రీడ్ చురకలంటించారు. ప్రస్తుతం నిక్కీ దంపతులకు బోధి సోలీల్ సోమర్‌హాల్డర్ అనే పాప ఉంది. 'భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను. లేనిపోని వదంతులు వ్యాప్తిచేసి మా కాపురంలో నిప్పులు పోయడం మీకు భావ్యం కాదు. నటిగా, కథా-పాటల రచయితగా, మోడల్‌గా మంచిపేరు సంపాదించుకున్నాను. కేవలం ఇలాంటి కొన్ని వదంతుల కారణంగా వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత కోల్పోతున్నానంటూ' నటి నిక్కీ రీడ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top