వారితో నా కుమార్తెకు హాని: నటుడు బాలాజి | Actor Thadi Balaji Comments On Wife And SI | Sakshi
Sakshi News home page

వారితో నా కుమార్తెకు హాని: నటుడు బాలాజి

Mar 1 2019 8:42 AM | Updated on Mar 1 2019 8:42 AM

Actor Thadi Balaji Comments On Wife And SI - Sakshi

చెన్నై: భార్య నిత్య, ఎస్‌ఐ మనోజ్‌లతో తన కుమార్తె ప్రాణాలకు హాని ఉందని నటుడు, టీవీ యాంకర్‌ దాడి బాలాజీ ఆరోపించారు. ఈయన భార్య నిత్య మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి బాలాజి, నిత్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. వీరి విడాకుల పిటిషన్‌ విచారణలో ఉంది. కాగా ఇటీవల తన భర్త దాడి బాలాజి తనను చిత్రహించలకు గురి చేస్తున్నాడని, హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నాడని నిత్య వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు దాడి బాలాజీని ఫోన్‌లో విచారించగా తాను షూటింగ్‌ కారణంగా వేరే ఊరిలో ఉన్నానని, చెన్నైకి తిరిగి రాగానే కలుస్తానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో దాడి బాలాజి గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో తన ఎదుగుదలను చూసి తన భార్య నిత్య అసూయ పడుతోందన్నాడు.

తనూ నటి కావాలన్న ఆశతో శరీర బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లిందన్నారు. అక్కడ జిమ్‌లోని శిక్షకుడితో పరిచయం పెంచుకుందన్నారు. దీన్ని ఖండించిన తాను తన స్నేహితుడైన ఎస్‌ఐ మనోజ్‌కు ఫిర్యాదు చేశాన్నారు. అయితే అతను చర్యలు తీసుకోకుండా, తన కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మనోజ్‌ తన భార్యకు ఒక మోబైల్‌ ఫోన్‌ కొనిచ్చాడని, ఆ ఫోన్‌ ద్వారా వారిద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తన భార్యను కలిసి రెండేళ్లకు పైగా అయ్యిందన్నారు. అప్పటి నుంచి ఆమె తనపై నేరారోపణలు చేస్తూనే ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తన కూతురు భవిష్యత్‌ దెబ్బతింటుందన్నారు. తన భార్య, ఎస్‌ఐ మనోజ్‌ కారణంగా తన కూతురు ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా మనోజ్‌పై చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తన కూతురిని ఏదైనా రెసిడెంట్‌ పాఠశాలలో చేర్పిస్తే మంచిదని, ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని దాడి బాలాజి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement