సీనియర్‌ నటుడు చిన్నా భార్య కన్నుమూత

సీనియర్‌ నటుడు చిన్నా భార్య కన్నుమూత


సాక్షి, హైదరాబాద్‌:  టాలీవుడ్‌ సీనియర్ నటుడు చిన్నా(శివ ఫేం)  భార్య శిరీష (42) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చిన్నా మీడియాకు వెల్లడించారు.  దీంతో  ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 


చిన్నా, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన  శివ సినిమాలోని  చిన్నా  పాత్రతో అలరించిన జితేంద్ర రెడ్డి  ఆ పేరుతోనే గుర్తింపు పొందారు..  అనంతరం 'మనీ' సిరీస్‌లో   హీరోగా నటించిన చిన్నా ఒక హారర్‌ చిత్రం 'ఆ  ఇంట్లో’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.

 

Back to Top