అభిమానులకు సూర్య విజ్ఞప్తి 

Acter Suriya Appeal To Fans - Sakshi

సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుండే వారిలో నటుడు శివకుమార్‌ కుటుంబం ఒకటి. అనేక పేద విద్యార్థులకు తమ అగరం ఫౌండేషన్‌ ద్వారా విద్యాదానం చేస్తున్న సూర్య ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారిని ఆదుకోవడానికి ముందు వరుసలోనే ఉన్నారు. దక్షిణ భారత సినీ కార్మికులకు ముందుగా ఆర్థిక సహాయాన్ని అందించింది నటుడు శివకుమార్‌ కుటుంబమే అన్నది గమనార్హం.

సూర్యనే కాదు ఆయన అభిమానులు కూడా సాయం చేయడంలో ముందుంటారు. ఈ కరోనా సమయంలో సూర్య అభిమానులు ఎందరో పేదలకు అనేక విధాలుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. వారి సహాయాన్ని సూర్య ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేశారు. ఆయన రాసిన లేఖలో పేర్కొంటూ ఇలాంటి కష్టకాలంలో అభిమానులు నిరంతరం సేవా కార్యక్రమాలు పాల్గొనడం సాధారణ విషయం కాదన్నారు. చదవండి: కరోనా మా కుటుంబాన్ని వణికించింది 

కాగా అభిమానులకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానని అన్నారు. పేదలకు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేయండి అని అన్నారు. అయితే ఏ విధంగానూ తనకు బాధ కలిగించేవి చేయొద్దని పేర్కొన్నారు. అధేవిధంగా కొందరు ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివి సాధ్యమైనంత వరకు నిషేధించాలని చెప్పారు. నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తన అభిమానులను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సూర్య పేర్కొన్నారు.

చదవండి: మొదటి రాత్రే భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top