‘ఐశ్వర్యా రాయ్‌కు అప్పుడు ప్రపోజ్‌ చేశా’

Abhishek Says Proposed to Aishwarya After Umrao Jaan - Sakshi

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ ఈస్ట్‌ 2018 సమ్మిట్‌లో అభిషేక్‌ బచ్చన్‌

కోల్‌కతా: అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్‌ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఐష్‌ అందం ఇసుమంత కూడా తగ్గలేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి అందాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతో మంది పోటీ పడినప్పటికీ అభిషేక్‌ బచ్చన్‌నే ఆ అదృష్టం వరించింది. అయితే పెళ్లై పదకొండేళ్ల ఓ కూతరున్న కూడా ఈ జంటపై ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది. ఐశ్వర్య ఇగోయిస్ట్‌ అనీ, అభిషేక్‌ ఆమెతో వేగలేకపోతున్నారనీ, త్వరలోనే ఈ కపుల్‌ విడిపోయే అవకాశాలున్నాయంటూ ఏదో ఒక వార్త బీటౌన్‌లో చక్కర్లుకొడుతోంది.

అయితే ఈ గాసిప్స్‌పై అభిషేక్‌ బచ్చన్‌ స్పందించాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ.. అవన్నీ గాలివార్తలేనని కొట్టిపారేశాడు. అంతేకాకుండా తన ప్రేమ కథను తెలియజేశాడు. ‘ ఐశ్వర్యాతో కలిసి నా తొలి చిత్రాల్లో పనిచేశాను. మేమిద్దం కలిసి నటించిన తొలి చిత్రం ‘ధాయి అక్షర్‌ ప్రేమ్‌కే’ . అప్పటి నుంచి మంచి స్నేహితులమయ్యాం. ‘కుచ్‌ న కహో’  చిత్రంతో మా స్నేహం మరింత బలపడింది. ‘ఉమ్రా జాన్‌’ చిత్రానికి వచ్చే సరికి మా మధ్య ప్రేమ చిగురించింది.

ఈ మూవీ అనంతరం నేను ఆమెకు ప్రపోజ్‌ చేశాను. అనంతరం పెళ్లిచేసుకోన్నాం. మాకు ఓ పాప కూడా పుట్టింది. ఆరాధ్యా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐశ్వర్య ఓ సూపర్‌ వుమన్‌ అని అభిషేక్‌ కొనియాడాడు. ఆమె చేసే పనికి అంకితమవుతోందని, అది ఓ తల్లిగా, నటిగా కూడా అని తెలిపారు. త్వరలోనే ఈ ఇద్దరూ ‘గులాబ్‌ జామూన్‌’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top