అనుకోని వ్యక్తి వస్తే!

Aame Korika movie Release in August - Sakshi

యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతీ నాయుడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆమె కోరిక’. వల్లభనేని సురేశ్‌ చౌదరి దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. సురేశ్‌ చౌదరి మాట్లాడుతూ– ‘‘భార్యాభర్తల అనుబంధంలోకి అనుకోని వ్యక్తి రావడంతో ఆ సంసారం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.

లవ్, రొమాన్స్, ఫ్యామిలీ, సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాలుంటాయి. స్వాతీ నాయుడు నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. త్వరలో తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నివాస్‌ గోగులపాటి, కెమెరా: ప్రసాద్, సంగీతం: తలారి శ్రీనివాస్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top