విజయ్‌-త్రిష.. 96 టీజర్‌

96 Movie Official Teaser Released - Sakshi

కోలీవుడ్‌లో మరో అందమైన ప్రేమ కథ రాబోతుంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన 96 టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. సినిమాటోగ్రఫర్‌ సీ ప్రేమ్‌ కుమార్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. టీజర్‌ విషయానికొస్తే.. ఫోటోగ్రాఫర్‌గా విజయ్‌, ట్రెడిషనల్‌ గర్ల్‌గా త్రిష కనిపించారు. హీరో-హీరోయిన్‌ రెండు పాత్రలనే చూపించగా.. డైలాగులు లేకుండా కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే టీజర్‌ ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల ఆనంద క్షణాలు.. చివర్లో ఎమోషన్‌.. టోటల్‌గా 96 ఓ అందమైన ప్రేమకథ తెరకెక్కినట్లు తెలుస్తోంది. గోవింద్‌ వసంత్‌ సంగీతం అందించగా.. మద్రాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై నందగోపాల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్‌ డేట్‌ ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే విజయ్‌ సేతుపతి నటించిన జుంగా, సూపర్‌ డీలక్స్‌, సీతకత్తి తదితర చిత్రాలు రిలీజ్‌కు రెడీకాగా, మరోవైపు త్రిష నటించిన ఓ మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top