‘2.ఓ’ రిలీజ్‌ డేట్‌పై కన్ఫ్యూజన్‌

2.O Release date confusion - Sakshi

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ముందుగా ఈ సినిమాను 2018 జనవరి 25న రిలీజ్‌ చేయనున్నట్టుగా చిత్రయూనిట్‌ ప్రకటించారు.

అయితే భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అనుకున్న సమయానికి పూర్తి కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా రిలీజ్‌ వాయిదా పడిందన్నవార్తలు కూడా వినిపించాయి. దీంతో వేసవి బరిలో ఉన్న చిత్రనిర్మాతల్లో గుబులు మొదలైంది. కానీ చిత్రయూనిట్‌ మాత్రం వాయిదా విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ప్రముఖ కోలీవుడ్‌ ఎనలిస్ట్‌ శ్రీధర్‌ పిల్లై 2.ఓ ముందుగా ప్రకటించనట్టుగా జనవరి 25నే రిలీజ్‌ అవుతుందంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ భారీ చిత్రం రిలీజ్‌ డేట్‌ పై కన్ఫ్యూజన్‌ ఏర్పడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top