IPL-2019

సాక్షి, హైదరాబాద్‌: అశేష ఆదరణతో, అనేక విశేషాలతో సాగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 12వ సీజన్‌కు రికార్డుల పరంగా అంతే స్థాయి గల జట్లయిన చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య ఫైనల్‌తో తెరపడనుంది. చెరో మూడుసార్లు కప్‌ గెలిచిన ఈ రెండు జట్లూ బలాబలాల పరంగా సమఉజ్జీలు. మ్యాచ్‌ ఫలితాన్ని అమాంతం మార్చేసే బ్యాట్స్‌మెన్, ప్రత్యర్థిని కట్టిపడేసే బౌలర్లు, మెరుపు విన్యాసాల ఫీల్డర్లతో ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. అయితే, చెన్నైపై లీగ్‌ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలతో గణాంకాల్లో ఈసారి ముంబైదే పై చేయి. మరి... ఇదే ఊపులో కెప్టెన్‌ రోహిత్‌  శర్మ బృందం కప్‌ను ఎగరేసుకుపోతుందో? ఈ పరాజయాలకు ‘మిస్టర్‌ కూల్‌’ ధోని జట్టు ఘనంగా ప్రతీకారం తీర్చుకుంటుందో? చూడాలి. 



 

Back to Top