తమ్ముడి ఫ్రెండ్‌ అని తెలిసి మెసేజ్‌లు ఆపేశా..

Vamshikrishna Sad Ending Love Story - Sakshi

నేను ఇంటర్‌ చదివేరోజులవి. ఎక్జామ్‌ సెంటర్‌లో తనను చూశాను. ఎక్జామ్‌ సంగతి అటుంచి తను నా క్లాస్‌ అయితే బావుండు అని కోరుకున్నా. దేవుడు నా మొర విన్నాడేమో..ఆ అమ్మాయి నా పక్క బెంచే. నా చూపులు ఆమె వైపే. ఇంతలో బెల్‌ మోగింది. ఎక్జామ్‌ స్టార్ట్‌ అయ్యింది. కానీ నా అటెన్షన్‌ మొత్తం తన వైపే ఉంది. ఎన్నిసార్లు చూసినా చూపుతిప్పుకోనంత అందం తనది. తన పేరు సిరి. ఒక్కోసారి పరీక్షల్లో నాకు కూడా సహాయం చేసింది. ఎక్జామ్స్‌ అయిపోయాయి. తనను మాత్రం అస్సలు మర్చిపోలేకపోతున్నా. అందరూ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తే..నేను మాత్రం తనను ఎలా కాంటాక్ట్‌ అవ్వాలా అని ఆలోచించేవాడిని.

ఓ రోజు ఫేస్‌బుక్‌లో సెర్చ్‌ చేశా. తన ఐడీ కనిపించింది. ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యా. వెంటనే తనకు మెసేజ్‌ చేశా. తను మాత్రం నాకు మెసేజ్‌లు చేయకు అనేసింది. అయినా నేను వినలేదు. చివరికి వాళ్ల అన్నయ్యతో చెప్పించింది. నేను అసలు పట్టించుకోలేదు. బ్లాక్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ చేశా. నాకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడంటూ బాంబ్‌ పేల్చింది. అయినా వెనక్కి తగ్గాలనిపించలేదు. కనీసం ఫ్రెండ్స్‌లా ఉందామని మెసేజ్‌లు చేసేవాడ్ని. తను పట్టించుకోలేదు. అయినా మనం వెనక్కి తగ్గలేదు. టిక్‌టాక్‌లో తనను ఫాలో అయ్యా. తన ప్రతీ వీడియోకి కామెంట్‌ పెట్టేవాడిని. ఈ తతంగం మొత్తం తన బాయ్‌ఫ్రెండ్‌కి తెలిసింది. నాకు వార్నింగ్‌ ఇచ్చాడు సిరికి ఇంకెప్పుడూ మెసేజ్‌ చేయవద్దని, తర్వాత కొన్ని రోజులు నేను కూడా సిరికి మెసేజ్‌ చేయడం మానేశాను. కానీ నా ఊహాలన్నీ తన చుట్టూనే తిరిగేవి.

కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే సిరి ప్రేమిస్తున్న అబ్బాయి నా తమ్ముడి ఫ్రెండ్‌ రాకేశ్‌ అని. ఇంక అప్పట్నుంచి తనకి మెసేజ్‌ చేయకూడదని డిసైడ్‌ అయ్యా. అలా రోజులు, నెలలు గడిచాయి. ఒక సంవత్సరం తర్వాత తెలిసింది రాకేశ్‌..ఓ యాక్సిడెంట్‌లో చనిపోయాడని.. మొదట్లో చాలా బాధేసింది. సిరి ఎలా ఉందో అని తన గురించే రోజూ ఆలోచిస్తున్నా. మళ్లీ తనకి నా ద్వారా సంతోషాన్ని పంచాలనుకుంటున్నా..

వంశీకృష్ణ ( విక్కీ)

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top