ఓపికతో ఉంటే ప్రేమను గెలిపించుకోవచ్చు

Rupa happy Ending Telugu Love Story Guntur Town - Sakshi

ఫస్ట్‌ మాట్లాడిన డేట్‌, టైమ్‌, కలసిన ప్లేస్‌ గుర్తులేదు కానీ, నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. నా పేరు స్వరూప. నేను గొప్పగా కలలు కనేదాన్ని అందుకే గొప్పగా ఏదైనా చేద్దామని సీఎలో జాయిన్‌ అయ్యాను. కానీ ఆ కోర్స్‌లో నేను అంత గొప్పగా రాణించలేకపోయాను. దాని ఫలితం డిప్రెషన్‌. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్లాప్స్‌లో ఉన్న టాప్‌ హీరోలా ఉంది నా పరిస్థితి. అప్పుడు పవన్‌కళ్యాణ్‌ లైఫ్‌లో గబ్బర్‌సింగ్‌లా నా లైఫ్‌లో ఓ మెరాకిల్‌ జరిగింది. నాకు మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్‌ అతను. తన పేరు మణికంఠ. నాకిష్టమైన పవన్‌కళ్యాణ్‌ పక్కన నా హీరోలా అనిపించాడు. తనని మొదటిసారి చూడగానే ఏదో కొత్తగా కాకుండా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు అనిపించింది. చూడటానికి బలపంలా సన్నగా ఉన్నాడు. కానీ చాలా బాగున్నాడు. ప్రేమ అందమైనది అందుకే ప్రేమించిన వ్యక్తి అంత అందంగా కనిపిస్తారు. చప్పగా ఉన్న నా లైఫ్‌లోకి టేస్టీ లాలీపప్‌లా వచ్చాడు మణికంఠ. చాలా బాగా మాట్లాడుకునే వాళ్లం. అతను బ్రాహ్మిణ్‌ అని తెలిసింది. తన కోసం వాళ్లకు తగ్గట్టు ఉండాలని నాన్‌వెజ్‌ తినడం మానేశాను. వాళ్ల పద్దతులన్ని నేర్చుకున్నాను. నాకు కోపం ఎక్కువ, అతనికి ఓపిక ఎక్కువ. సో! బాలెన్స్‌ షీట్‌లో ఎసెట్స్‌, లైబిలిటీస్‌ లాగా టాలీ అయ్యాం. ఇంకా నా ప్రేమను అతనికి చెప్పేయాలని డిసైడయ్యాను.

గుణ సినిమాలో కమల్‌హాసన్‌లా నా ప్రేమను చెప్పాలనుకున్నా! కానీ, ఖుషి మూవీలో పవన్‌కళ్యాణ్‌లా కన్ఫ్యూజింగ్‌గానే కమ్యూనికేట్‌ చేశాను. సేమ్‌ అలాగే చాలా కన్ఫ్యూజన్స్‌, ఏడుపుల మధ్య మా ప్రేమ చిగురించింది. అది పెరిగి పెద్దదయ్యి పువ్వు పూసింది. ఆ పువ్వు వాసన మా పేరెంట్స్‌ను చేరింది. అదేనండి మా ప్రేమ పెళ్లికి వచ్చింది. అన్ని ప్రేమ కథల్లో లాగానే మా ప్రేమ కథ కూడా మా ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. ఒకరింట్లో కుల పట్టింపు, మరొకరి ఇంట్లో ఆస్తి పట్టింపు. ఇలా గొడవలు, పేరెంట్స్‌ ఏడుపులు. వాళ్లు కష్టపడి ఢీల్లీ సింహాసనం మాకు సంపాదించి ఇస్తే మేమేదో అది పక్క దేశానికి అమ్మేసినట్లు. టైమ్‌ దేనికైనా సమాధానం చెబుతుంది. అతనికి ఓపిక ఎక్కువ. నేను మా పేరెంట్స్‌కు, అతనికి మధ్య నలిగిపోయాను. ఏం చేయాలో తెలియక అందరికీ దూరంగా కేరళ వెళ్లిపోయాను. అక్కడ మెడిటేషన్‌ సెంటర్‌లో జాయిన్‌ అయ్యాను. మెడిటేషన్‌ చేస్తూ చాలా ప్లేసులు తిరుగుతూ అక్కడే ఉండిపోయాను.

ఒక ఫ్రెండ్‌ ద్వారా ‘‘ఇంట్లో వాళ్లను, మణికంఠను కంగారు పడొద్దని చెప్పు, నేను బాగానే ఉన్నాను’’ అనే మెసేజ్‌ను అందించాను. నేను మూడు నెలలు అక్కడే ఉండిపోయాను. ఈ గ్యాప్‌లో నాకు ప్రశాంతత దొరికింది. అతనికి నేను లేకపోతే లైఫ్‌ లేదనే బాధ పెరిగి వాళ్ల ఇంట్లో వాళ్లతో ఫైట్‌ చేసి ఒప్పించాడు. మా ఇంట్లో వాళ్లకి ఏం జరిగిందో తెలియదు కానీ నన్ను ఎలాగో కనుక్కొని మా పెళ్లికి ఒప్పుకున్నారు. మా అత్తామామయ్యలు మొదట్లో నాతో సరిగ్గా మాట్లాడే వారు కాదు. కానీ ఇప్పుడు మణి కంటే నన్నే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకు మరో అమ్మ నాన్న వారికి మరో కూతురు దొరికింది. ఇది నా ప్రేమ కథ. ఇప్పుడు అంతా బాగుంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ప్రేమ కాదు కానీ నా జీవితాన్నే మార్చేసిన ప్రేమ నాది. నిజంగా ప్రేమకు శక్తి ఉంది. అది ప్రేమించే మనిషితో పాటు ప్రేమించే కుటుంబాన్ని కూడా ఇస్తుంది. ఓపికతో ఉండండి. ప్రేమించేటప్పుడు పట్టుకున్న చేతిని పోయే వరకు వదలకండి. లవ్‌ యూ ఉడత ( నేను మణిని అలానే పిలుస్తాను).
- స్వరూప, గుంటూరు. 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top