రాకింగ్‌ స్టార్‌ ఇంటి ధర వింటే షాక్‌...

kannada actor yash purchage house - Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి : కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ ఇటీవల కొనుగోలుచేసిన ఇళ‍్ల ధర ఎంతో తెలుసా?. రేటు వింటే షాక్‌ అవ్వాల్సిందే. యశ్‌ ఇటీవల బెంగళూరు నగరంలో రూ.60 కోట‍్ల పైగా ఖరీదుచేసే పెంట్‌ హౌజ్‌లను కొనుగోలుచేశాడు. 

గత డిసెంబర్‌ నెలలోనే యశ్‌ అత్యంత ఖరీదైన మూడు మెర్సిడీజ్‌ బెంజ్‌ కార‍్లను తన భార్య రాధిక పండిత్, తల్లిదండ్రులకు కొనిచ్చాడు. బెంగళూరు నగరంలో అత్యంత ఖరీదైన అపార్టుమెంట్‌లు నిర్మించడంలో ప్రెస్టీజ్‌ కంపెనిది మొదటి స్థానం. ఈ ప్రెస్టీజ్‌ ఆబ్సహాట్‌ అనే అపార్టుమెంటులో రెండు పెంట్‌ హౌజ్‌లను రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కోనుగోలు చేశారు.

ఈ అపార్టుమెంటులో ఒక్కో ఫ్లాట్‌ ఖరీదు రూ.30 కోట్ల పై మాటే. ప్రస్తుతం యశ్‌ కోనుగొలు చేసిన అపార్టుమెంట్‌లోనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అత‍్యధిక ధనవంతులైన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు నివాసం ఉన్నారు. ప్రస్తుతం రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కోనుగొలు చేసిన ఈ పెంట్‌ హౌజ్‌ నుంచి గాల్ఫ్‌హౌజ్, విధానసౌధ, ముఖ్యమంత్రి నివాసం, అన్ని కూడా నాలుగు దిక్కుల్లో కనిపిస్తాయి.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top