మాజీ ఎమ్మెల్యే మురళీధరన్‌ ఇకలేరు

Ex mla Muraleedharan passes away - Sakshi

అనారోగ్యంతో మృతి  

తెలుగు వీరాభిమానికి కన్నీటి వీడ్కోలు    

హొసూరు: తెలుగు మాజీ ఎమ్మెల్యే, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, అజాత శత్రువుగా అందరికీ ఆప్తుడు కే.వి.మురళీధరన్‌ (54) అనారోగ్య కారణంగా శనివారం రాత్రి బెంగళూరు ఆస్పత్రిలో మరణించాడు. 2001 నుండి 2006 వరకు బీజేపీ తరఫున తళి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 నుండి 2000 వరకు కెలమంగలం సమితి చైర్మన్‌గా తమిళ మానిల కాంగ్రెస్‌ నుంచి ఎన్నికయ్యారు. డెంకణీకోట తాలూకా కుందుమారనపల్లి గ్రామంలో బలమైన రాజకీయ కుటుంబంలో జని్మంచిన కే.వి. మురళీధరన్‌ చిన్నవయస్సులోనే చైర్మన్, ఎమ్మెల్యేగా పదవులలో కొనసాగారు. తమిళమానిల కాంగ్రెస్, అక్కడి నుండి బీజేపి, అక్కడి నుండి అన్నాడీఎంకే పారీ్టలలో చేరారు. తళి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. తెలుగు భాషా సంరక్షణ కోసం కృషి చేశారు.

పెద్దబేళూరు గ్రామసభలో పాల్గొన్న  మురళీధరన్‌(ఫైల్‌)
 
అసెంబ్లీలో తెలుగులో ప్రసంగం  
శాసనసభలో తెలుగులో మాట్లాడి తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు. హొసూరులో ధర్మపురి జిల్లా తెలుగు మహాసభలను నిర్వహించేందుకు కృషి చేశారు. తమిళనాడు గవర్నర్‌ రాంమోహన్‌రావుని హొసూరుకు ఆహా్వనించి తమిళనాడులో తెలుగువారి కష్టాలను వివరించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. బీజేపీలో నాయకులు ఎం.వెంకయ్యనాయుడు, తదితర ముఖ్య నేతలతో మంచి సంబంధాలుండేవి.
 
హొసూరుకు ఎన్నికల ప్రజారానికి విచ్చేసిన బీజేపీ నేత ఎల్‌.కే. అధ్వానితో  మురళీధరన్‌ (ఫైల్‌) 

ముఖ్యుల సంతాపం  
కే.వి.మురళీధరన్‌ మృతికి మాజీ మంత్రి పి. బాలక్రిష్ణారెడ్డి, తళి ఎమ్మెల్యే వై.ప్రకా‹Ù, హొసూరు ఎమ్మెల్యే ఎస్‌.ఏ.సత్య, మాజీ ఎమ్మెల్యేలు కే.ఏ.మనోహరన్, కే. గోపీనాథ్, టి. వెంకటరెడ్డి, తళి మాజీ ఎమ్మెల్యే టి. రామచంద్రన్, హొసూరు డీఎంకే నాయకులు ఎన్‌.ఎస్‌.మాదేశ్వరన్, బీజేపీ నాయకులు నరేంద్రన్, జిల్లా  అధ్యక్షులు మునిరాజు, బాలక్రిష్ణన్, కెలమంగలం పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షులు చెన్నబసప్ప, సయ్యద్‌హస్సేన్, కుందుమారనపల్లి, బైరమంగలం పంచాయతీ మాజీ అధ్యక్షులు క్రిష్ణమూర్తి, సత్యనారాయణరెడ్డి, వివిధ రాజకీయ పారీ్టల నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు.  

కుందుమారనపల్లిలో అంత్యక్రియలు  
కే.వి.మురళీధరన్‌ స్వంతగ్రామం కుందుమారనపల్లిలో ఆదివారం సాయంత్రం మురళీధరన్‌ అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది అభిమానులు, బంధువులు తరలివచ్చారు. మురళీధరన్‌కు భార్య ఉన్నారు. అజాత శత్రువు, నిర్వార్థపరుడు. తెలుగుభాషాభిమానిగా, ప్రజాసేవకునిగా అంత్యక్రియల్లో కొనియాడుతూ అభిమానులు కన్నీటి నివాళి అరి్పంచారు.   

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top