కావాలనే కారు ప్రమాదం!

Car driver of min Revu Naik Belamgi involves in his murder plan

మాజీ మంత్రి రేవునాయక్‌ టార్గెట్‌

ప్రమాదం సృష్టించిన డ్రైవర్‌

కలబుర్గి టికెట్‌ కోసం ఆశావహుల స్కెచ్‌

బెంగళూరు (కలబుర్గి):
కర్ణాటకలో రానున్న శాసనసభ ఎన్నికల్లో టికెట్టు ఆశిస్తున్న వ్యక్తిని అంతమొందించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్ని రోడ్డు ప్రమాదాన్ని సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... బీజేపీ సీనియర్‌ నేత మాజీ మంత్రి రేవునాయక్‌ బెళమగికి కలబుర్గి గ్రామీణ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. పార్టీ రహస్య సర్వేలో కూడా ఆయనకే టికెట్టు ఇస్తే మంచిదన్న అభిప్రాయం కూడా వచ్చింది. అయితే ఆ నియోజక వర్గం నుంచి టికెట్టు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 20న చించనసూరు వద్ద రేవునాయక్‌ వస్తున్న కారు బోల్తా పడింది.

ఈ ఘటనలో కారు డ్రైవర్‌ వినయ్‌ కుమార్‌ స్వల్పంగా గాయపడగా రేవునాయక్‌ తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనం కండీషన్‌లో ఉంది, డ్రైవర్‌ మద్యం మత్తులో లేడు, రహదారి కూడా బాగుంది. ఈ నేపథ్యంలో కారు ఎలా బోల్తా పడింది అనే దానిపై పోలీసులు అనుమానించారు. కావాలనే ప్రమాదం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని రేవునాయక్‌కు కూడా తెలిపారు.

దీంతో రేవు నాయక్‌ నమ్మకమైన వారితో కూపీ లాగారు. ఘటన జరగడానికి దాదాపు పదిహేను రోజుల ముందు వినయ్‌ను స్థానిక జెడ్‌పీటీసీ సభ్యుడొకరు తరచూ కలుసుకునే వారని సమాచారం. ఈ విషయమై రేవు నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటన వెనుక ఉన్నవారిపై కొంత సమాచారం ఉంది. ఈ విషయాలన్నింటినీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తా’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top