'అమెరికాపై దాడి చేస్తే మీకర్మ.. మేం రాము'

'అమెరికాపై దాడి చేస్తే మీకర్మ.. మేం రాము'


బీజింగ్‌: ఉత్తర కొరియాను చైనా హెచ్చరించింది. దూకుడు చర్యలు ఆపకుంటే తాము ఏం చేయలేమని స్పష్టం చేసింది. అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి అనర్థం కొని తెచ్చుకుంటే జరగబోయే పరిణామాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము సాయంగా రాబోమని తెలిపింది. ఈ మేరకు చైనాకు చెందిన అధికారిక మీడియా పత్రికలో స్పష్టం చేసింది. అయితే, ఒకవేళ అమెరికానే ముందుగా క్షిపణులు ప్రయోగిస్తే అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని కూడా తెలిపింది.చైనా అతిపెద్ద పార్టీ అయిన కమ్యునిస్టు పార్టీ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో వెలువడిన ప్రకారం అమెరికా వైమానిక స్థావరాలపై తాను క్షిపణుల ప్రయోగిస్తానంటూ ఉత్తర కొరియా బెదిరిస్తూ వస్తుంది. అయితే, నిజంగానే అమెరికా భూభాగంలోకి ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగిస్తే తాము సహాయం చేసేందుకు రాబోమని చైనా పేర్కొంది. ఇరు దేశాల్లో దేని పక్షాన ఉండకుండా తటస్థంగా ఉంటామని, పరిస్థితులు ఉత్తర కొరియానే ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒక వేళ అమెరికానే ముందుగా ఉత్తర కొరియాపై క్షిపణి ప్రయోగాలు చేస్తే.. దాని ప్రభావం తమ దేశంపై పడితే అప్పుడు జోక్యం చేసుకొని ఎలాంటి అనర్ధం జరగకుండా చూస్తామని స్పష్టం చేసింది.

Back to Top