తొలిసారి ‘తలలు’మార్చారు

World's first successful head transplant carried out on corpses, claims scientist - Sakshi

ఇటలీ : మరణించిన ఇద్దరు వ్యక్తుల తలలను విజయవంతంగా మార్పిడి చేశారు. ఇటలీకి చెందిన సర్జన్‌ సెర్గీ కనవెరో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌ 18 గంటల పాటు సాగింది. తొలుత రెండు మృతదేహాల నుంచి తలలను విడదీసిన వైద్యులు.. ఒకరి తలను మరొకరికి అమర్చారు. ఇందులో భాగంగా నాడి, రక్త కణ జాలలను తిరిగి తలకు అనుసంధానించారు.

ఈ మేరకు కనవెరో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచలోని మొదటి హ్యుమన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ ఇదేనని తెలిపారు. భవిష్యత్‌లో ప్రాణాలు ఉన్న వ్యక్తులకు ఈ సర్జరీ నిర్వహించి విజయవంతం చేస్తామని వెల్లడించారు. కనవెరో ప్రకటనపై స్పందించిన కొందరు శాస్త్రవేత్తలు ప్రాణమున్న మనుషులపై ఈ సర్జరీ నిర్వహిస్తే ఫలితం మరణాన్ని మించి ఉంటుందని హెచ్చరించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top