జాబిల్లిపై నీటిని తయారు చేయవచ్చు..

Water can be made on the moon

ఇంకొన్నేళ్లలో జాబిల్లిపైకి.. ఆ తరువాత అంగారకుడిపైకి ఎగిరి పోయేందుకు మానవజాతి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ ఒకరు జాబిల్లిపై నీరు తయారు చేసేందుకు ఓ యంత్రాన్ని సిద్ధం చేశారు. సూర్యుడి శక్తితోపాటు చంద్రుడిపై ఉండే మట్టి సాయంతో ఈ యంత్రం దాదాపు 8 మంది వ్యోమగాములకు నీటితోపాటు ఆక్సిజన్‌ను అందించగలుగుతుందని అంటున్నారు ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ డెంక్‌! స్పెయిన్‌లోని ప్లాటఫోర్మా సోలార్‌ డీ అల్మేరాలో పదేళ్లపాటు శ్రమించి తాను ఈ యంత్రాన్ని తయారు చేశానని డెంక్‌ తెలిపారు.

భూమ్మీది మట్టి, వాతావరణం, నీరు కారణంగా చాలావరకు గుండ్రటి ఆకారంలో ఉంటుందని.. జాబిల్లిపై మాత్రం వేర్వేరు ఆకారాల్లో ఉంటుందని డెంక్‌ తెలిపారు. అందువల్ల జాబిల్లిపైని మట్టితో నీటిని తయారు చేసే ముందు దాన్ని మరింత సూక్ష్మస్థాయిలోకి మెత్తగా పొడి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జాబిల్లిపైనే లభించే ఇల్‌మినైట్‌ అనే పదార్థం మట్టిలోని ఆక్సిజన్‌ను వేరుచేస్తే.. దానికి కొంత సమయంపాటు హైడ్రోజన్‌ను అందిస్తే నీరు తయారవుతుందని.. ఆ తరువాత నీటిని మళ్లీ హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టడం ఈ యంత్రం ప్రత్యేకత అని డెంక్‌ తెలిపారు.

తాను అభివృద్ధి చేసిన యంత్రం ద్వారా కేవలం ఒక గంటలో 700 గ్రాముల నీటిని తయారు చేయవచ్చునని ప్రస్తుతం యంత్రం బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ 700 గ్రాముల నీటితో దాదాపు 2.5 కిలోల ఆక్సిజన్‌ను తయారు చేయవచ్చునని. ఇందుకు ఇంకో ఐదు గంటల సమయం కావాల్సి ఉంటుందని డెంక్‌ తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top