తప్పిపోయిన కుక్క.. ఇంటికి ఎలా చేరిందంటే

Watch Video Of Lost Dog Knocks On Door Of Clinic To Find Its Way home - Sakshi

థాయిలాండ్‌ :  చిన్న పిల్లలు తప్పిపోతే పోలీసులకు చెప్పి ఏదోలా పట్టుకుంటూ ఉంటారు.మరి కుక్కలు తప్పిపోతే పరిస్థితి ఏంటి. పల్లెటూర్లో అయితే సరే ఇంటికి వస్తాయని అనుకోవచ్చు.  మహానగరాల్లో అయితే తప్పిన కుక్కలు ఎలా ఇంటికి వస్తాయి.  రాగలవా ? దీనికి సరైన సమాధానంగా  థాయిలాండ్ లోని సామత్ ప్రాకన్ నగరంలో జరిగిన ఓ చిన్న సంఘటన చెప్పుకోవచ్చు. ఆ నగరంలో  సునీ బర్వానీ అనే మహిళ ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తోంది. ప్రతి రోజు తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా రెస్టారెంట్ కు తీసుకెళ్తుంది.  ఓరోజు రెస్టారెంట్ బయట కొన్ని కుక్కలు ఉండటంతో, సునీ బర్వానీ తన కుక్కని కూడా వదిలిపెట్టారు. అయితే, అది తిరిగి రాలేదు. మధ్యాహ్నం సమయంలో వెళ్లిన కుక్క తిరిగి రాకపోయే సరికి కంగారు పడ్డారు. రాత్రి 9 సమయంలో ఓ క్లినిక్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ తన పెంపుకు కుక్క ఉన్నది. (ఆడ‌పిల్ల ఉంటే ప్ర‌తినెలా రూ.2 వేలు: నిజమెంత‌?)

రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లిన ఆ కుక్కకు రెస్టారెంట్ అడ్రస్ తెలుసుకోలేకపోయింది.  అయితే, తనను రెగ్యులర్ గా ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లే యానిమల్ క్లినిక్ దగ్గరకు వెళ్ళింది.  ఆ కుక్కను గుర్తు పట్టిన క్లినిక్ సిబ్బంది   సునీ బర్వానీకి ఫోన్ చేశారు. అప్పటికే తన తప్పిపోయిన  కుక్కకు వెతుకుతున్న సునీ బర్వాని హుటాహుటిన అక్కడికి వచ్చారు.  అలా తప్పిపోయిన ఆ కుక్క ఇలా దొరికింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top