సాండ్‌విచ్‌ త్వరగా ఇవ్వలేదని కాల్చి చంపాడు..!

Waiter Shot Dead For Late Serving Sandwich In Paris - Sakshi

పారిస్‌ : ప్రాన్స్‌లోని ఓ హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. సాండ్‌విచ్‌ తెచ్చివ్వడంలో ఆలస్యమైందనే కారణంతో ఓ వ్యక్తి వెయిటర్‌ని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన తూర్పు పారిస్‌లోని నాయిసీలే గ్రాండ్‌ హోటల్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. వెయిటర్‌ (28) భుజంలోకి బుల్లెట్‌ దూసుకుపోవడంతో ప్రాణాలు విడిచాడు. నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. సహోద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సాండ్‌విచ్‌ కోసం హత్య చేశాడా..! అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్‌, మద్యానికి బానిసైన వ్యక్తులు తమ ప్రాంతంలో విచ్చవిడిగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top