అమెరికాతో పెట్టుకుంటే గల్లంతే..

US President Donald Trump warns North Korea - Sakshi

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు ట్రంప్‌ హెచ్చరిక

అణ్వాయుధాలు మిమ్మల్ని సురక్షితంగా ఉంచలేవు

అవి మరింత తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి

ఉత్తరకొరియా ఓ నరకం.. అక్కడ ఎవరూ ఉండలేరు

సియోల్‌: అణ్వాయుధ అహంకారంతో పదే పదే రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తున్న ఉత్తరకొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టి హెచ్చరికలు జారీచేశారు. ఈ వైఖరి కమ్యూనిస్టు దేశం చెరిపివేతకు దారితీస్తుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం దక్షిణకొరియా నేషనల్‌ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన తొలిసారిగా ప్రసంగించారు.

‘మీరు సేకరిస్తున్న ఆయుధాలు మిమ్మల్ని సురక్షితంగా ఉంచలేవు. ఇంకా తీవ్రప్రమాదంలో పడేస్తాయి. మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మిమ్మల్ని చీకటిమార్గంలోకి నెట్టేస్తుంది. మీ తాత కలలు కన్నరీతిలో ఉత్తరకొరియా స్వర్గంగా మారిపోలేదు. అదొక నరకం. అక్కడ ఎవరూ ఉండలేరు. మా బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. గతంలో మాదిరిగా కాకుండా అమెరికాలో ఓ భిన్నమైన ప్రభుత్వం అధికారంలో ఉంది. మా దేశంలోని రాష్ట్రాల గురించే నేను మాట్లాడడం లేదు. నాగరిక దేశాల గురించి కూడా మాట్లాడుతున్నా. ఇక ఉత్తరకొరియా విషయమై మాట్లాడుతున్నా. మ మ్మల్ని కదిలించేందుకు ప్రయత్నించొద్దు’  అని ఆ యన హెచ్చరించారు.

శాంతే తమ మంత్రమని, ఉత్తరకొరియా ఆట కట్టించేందుకు రష్యా, చైనా కలసి రావాలని ఆ యన విన్నవించారు. అణ్వాయుధా లతో బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ధూర్త దేశాన్ని ప్రపంచం లోని ఏ దేశమూ సహించబో దన్నారు. ఈ సందర్భంగా ఉత్తర, దక్షిణకొరియాలను పోలుస్తూ...దక్షిణకొరియా అద్భుతమైన ప్రదేశమని, అది ఎన్నో విజయాలను సాధించిందంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top