మహాత్మా గాంధీని సత్కరించుకోనున్న అమెరికా

US Plans To Honour Mahatma Gandhi With Americas Highest Civilian Honour - Sakshi

వాషింగ్టన్‌ : త్వరలోనే భారత జాతిపిత మహాత్మా గాంధీని గౌరవించుకున్న దేశాల సరసన అమెరికా కూడా నిలవబోతుంది. బాపు జీ జయంతి సందర్భంగా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని గాంధీకి ప్రధానం చేయాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహాత్మా గాంధీని తమ దేశ అత్యున్న పౌర పురస్కారాన్ని ప్రధానం చేసేందుకు అమెరికా చట్టసభ ప్రతినిధులు తీర్మానించారు. దీనికి సంబంధించి ఓ అరడజను మంది చట్టసభ ప్రతినిధులు.. చట్టసభలో ఓ ప్రతిపాదన కూడా చేసినట్లు సమాచరం. ఈ బృందంలో నలుగురు భారత సంతతి సభ్యులు కూడా ఉన్నట్లు తెలిసింది.

హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన కరోలిన్ మలోనే ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 23వ తేదీనే ఈ ప్రతిపాదన జరిగిందని.. చట్టసభ ప్రతినిధులు అమీ బిరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమిలా జయపాల్‌లు దీనిలో పాల్గొన్నట్లు తెలిసింది. అమెరికా.. ఈ అత్యున్నత పౌర పురస్కారం కింద గోల్డ్ మెడల్‌ను ఇస్తుంది. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది విదేశీయులు ఈ అవార్డును అందుకున్నారు. గతంలో మదర్ థెరిసా(1997), నెల్సన్ మండేలా(1998), పోప్ జాన్ పాల్-2(2000), దలైలామా(2006), ఆంగ్ సాన్ సూకీ(2008), మొహమ్మద్ యూనిస్(2010), షిమోన్ పీరస్(2014)లు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top