ట్రంప్‌ ట్వీట్లపై నిజనిర్థారణ చేసిన ట్విటర్‌

Twitter Labeled Two Tweets Of President Trump - Sakshi

న్యూయార్క్‌ : మెయిల్ ఇన్ ఓటింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన రెండు ట్వీట్లు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విటర్‌ నిజ నిర్థారణ చేసింది. అనంతరం ఆ రెండు ట్వీట్లను తప్పు దోవ పట్టించే వాటిగా లేబుల్‌ చేస్తూ హెచ్చరించింది. మంగళవారం ప్రెసిడెంట్‌ ట్రంప్ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌పై స్పందిస్తూ.. ‘‘ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ద్వారా మోసం చేయటానికి లేదని ఖచ్చితంగా చెప్పలేము. మెయిల్‌ బాక్సులను దొంగిలించవచ్చు. బ్యాలట్లను ఫోర్జరీ చేయవచ్చు. చట్టవిరుద్ధంగా వాటిని ప్రింట్‌ అవుట్‌ తీయవచ్చు. దొంగ సంతకాలు కూడా చెయోచ్చు. కాలిఫోర్నియా ప్రభుత్వం మిలియన్ల మంది ప్రజలకు బ్యాలట్లను పంపిస్తోందా?’’ అని ప్రశ్నించారు. ( చెక్కు కదా.. చెక్‌ చేసుకోవాలి: ట్రంప్‌ )

ఈ ట్వీట్‌తో పాటు మరో ట్వీట్‌పై నిజనిర్థారణ చేసిన ట్విటర్‌ స్పందిస్తూ.. ‘‘ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ద్వారా రిగ్గింగ్‌కు ఆస్కారం ఉందంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తప్పుడు ప్రకటనలు చేశారు. ఏది ఎమైనప్పటికి మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ద్వారా ఓటర్లు మోసాలకు పాల్పడే అవకాశం లేదని మా నిజ నిర్థారణ నిపుణులు తేల్చారు’’ అని పేర్కొంది. అనంతరం ట్రంప్‌ దీనిపై స్పందిస్తూ.. ‘‘ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్విటర్‌ జోక్యం చేసుకుంటోంది. మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌పై నేను చేసిన వ్యాఖ్యలు అవినీతి, మోసాలకు ఆస్కారమిస్తాయని అంటోంది. అది ముమ్మాటికి తప్ప’’ని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top