ట్రంప్ కేబినెట్ ప్రకటన ఈ వారంలోనే..!

ట్రంప్ కేబినెట్ ప్రకటన ఈ వారంలోనే..! - Sakshi


వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కేబినెట్ ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. తన కేబినెట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ట్రంప్ ఉన్నారని, ఈ వారంలో ఎప్పుడైనా ఆ జాబితా ప్రకటించవచ్చని ఆయన సన్నిహితులు ఈ రోజు మీడియాకు తెలిపారు. అధికార బదిలీ వ్యవహారాలకు సలహాదారుడిగా ఉన్న జాసన్ మిల్లర్ ప్రత్యేకంగా ఈ విషయంపై మాట్లాడుతూ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మైక్ పెన్స్ ఈ రోజు (మంగళవారం) న్యూయార్క్ వస్తున్నారని, ట్రంప్ తో భేటీ అవుతారని చెప్పారు.



వీరిద్దరు కలిసి కేబినెట్ అంశంపైనే చర్చించనున్నారని, చాలా సీరియస్ గానే ఈ చర్చ జరుగుతుందని, ఇలాంటి సమయంలో ఎవరూ ఎలాంటి ప్రకటన చేయొద్దని, చేసినప్పటికీ మీడియా వాటిని తీసుకోవద్దని సూచించారు. అలా వచ్చే ఊహాగానాలేవి తుది నిర్ణయాలు కాదని తెలిపారు. అధికార బదిలీ కార్యక్రమానికి మైక్ పెన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. సెక్రటరీ ఆప్‌ ది స్టేట్ రేసులో న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియాని, ఐక్యరాజ్య సమితికి అమెరికా తరుపున రాయబారిగా పనిచేసిన జాన్ బోల్టన్ ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top