ఈ వంద రోజులూ విజయవంతం: ట్రంప్‌

ఈ వంద రోజులూ విజయవంతం: ట్రంప్‌ - Sakshi


వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలో తన తొలి వంద రోజుల పాలన విజయవంతమైనదని అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా  రేడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలనలో గణనీయమైన మార్పు తీసుకువచ్చానన్నారు. జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ శనివారంతో వందరోజులు పూర్తి చేసుకున్నారు.


‘ దేశంలో ఏమి జరుగుతోందో ఓహియో, మిచిగాన్, పెన్సిల్వేనియా ప్రజలను అడగండి. కార్ల కంపెనీలు వెనక్కొచ్చాయి. ఆ కంపెనీలు ఇక్కడే ఉండాలనుకుంటున్నాయి’ అని చెప్పారు. అమెరికా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అమెరికా కంపెనీలు బాగా పనిచేస్తున్నాయని,  మంచి లాభాలు ప్రకటించాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, వ్యాపారస్తులకు, మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం తగ్గించిన తర్వాత మరింత ప్రభావం ఉంటుందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top