అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి - Sakshi


వాషింగ్టన్‌ : అమెరికా స్కూల్లో మళ్లీ తుపాకీ గర్జించింది.. ఒక నిండు ప్రాణం బలైంది. ఓ విద్యార్థి తనతో పాటు స్కూలుకు తెచ్చిన తుపాకితో తోటి స్నేహితులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొదట ముగ్గురు మరణించారని భావించినా.. చివరకు ఒకరు చనిపోయారు.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వాషింగ్టన్‌లోని రాక్‌ఫోర్డ్‌ అనే ప్రాంతంలో ఉన్న ఫ్రీమాన్‌ ఫైస్కూల్‌  ఈ ఘటన జరిగింది. 15ఏళ్ల ఒక విద్యార్థి  స్కూలుకు తనతోపాటు రైఫిల్‌,  హ్యాండ్‌గన్‌ వెంట తెచ్చుకున్నాడు. షూటింగ్‌ ప్రాక్టీస్‌ అని స్నేహితులకు చెప్పి కాల్పులు మొదలు పెట్టాడు.. మొదట గోడలను లక్ష్యంగా కాల్పులు జరిపినా.. చివరకు తన స్నేహితులు, అమ్మాయిలు కూర్చున్న వైపు హ్యాండ్‌గన్‌తోనూ, రైఫిల్‌తోనూ మార్చిమార్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అమ్మాయిలకు, ఒక అబ్బాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుల్లెట్లు నేరుగా తాకి ఒక విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top