మద్యం మత్తు: విమానం సీటుకు కట్టేసి..

Russia Drunk Passenger Taped To Seat During Flight - Sakshi

మాస్కో: మద్యం తాగి విమానంలో దురుసుగా ప్రవర్తించిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు గానూ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఘటన రష్యాలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.. ఓ వ్యక్తి మినరెల్నీ వోడీ నుంచి నోవోసిబిరిస్క్‌ వెళ్లేందుకు గానూ మంగళవారం ఎస్‌7 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కాడు. కాసేపటి తర్వాత కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇందుకు విమాన సిబ్బంది అడ్డుచెప్పగా వారితో వాగ్వాదానికి దిగాడు. ఎంతగా వారించినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ కెప్టెన్‌తో గొడవకు దిగాడు. 

ఈ క్రమంలో అతడి ప్రవర్తనతో బెంబేలెత్తిన తోటి ప్రయాణికులు అతడికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ సదరు వ్యక్తి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా దాడికి దిగాడు. దీంతో అతడిని విమానం సీటుకు కట్టేశారు. అయితే ఆ తర్వాత అతడు మరింతగా రెచ్చిపోయాడు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అందరిపై తిట్ల వర్షం కురిపించాడు. ఇక విమానం ల్యాండ్‌ అవగానే విమాన సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే అతడు పోలీసులను కూడా దూషిస్తూ.. దాడికి దిగడంతో అతడిని జైలులో బంధించారు. కాగా ఈ విషయం గురించి ప్రయాణికులు మాట్లాడుతూ.. తాగిన మైకంలో సదరు వ్యక్తి అడవి జంతువులా ప్రవర్తించాడని అందుకే అతడిని కట్టేశామని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top