కువైట్‌లో ఘోర ప్రమాదం: 17మంది మృతి

Road Accident in Kuwait - Sakshi

కువైట్‌ : పశ్చిమ కువైట్‌లోని బర్గాన్ అనే ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో 17 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కువైట్ ఆయిల్‌ కంపెనీకి చెందిన ఉద్యోగుల బస్సును మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాఫ్టర్లలో దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. మృతుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top