నాకు నేనుగా ఇరుక్కుంటినే!

Protest Against Ukraine Mayor Placard Goes Viral - Sakshi

అది ఉక్రేనియా దేశంలోని ఒలెస్క్‌ అనే పట్టణం. ఓ రోజు ఉదయమే అక్కడి ప్రజలు చాలామంది రోడ్డుపైకి ఎక్కి ఆ పట్టణం మేయర్‌ ఒలెగ్‌ ఒమెల్‌చుక్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడొద్దని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మేయర్‌కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేస్తున్నారు. అయితే అంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. దీంతో ఆ ప్లకార్డులను అతడి చేతికి ఇచ్చారు నిరసనకారులు. అక్కడికి వచ్చిన వ్యక్తి కూడా దాన్ని పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. మరి ఆ ప్లకార్డుపై ఏముందో చూసుకున్నాడో లేదో కానీ మొత్తానికి దాన్ని పట్టుకుని ఆ గుంపులో నిలుచున్నాడు. అలా పట్టుకుని ఆ ధర్నాను కామెడీ చేద్దామని ప్లాన్‌ చేశాడట ఆ మేయర్‌. కానీ రివర్స్‌లో మనోడినే నెటిజన్లు తెగ ఆడేసుకున్నారు. ఆ ఫొటో టీవీ, సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసేసింది. దీంతో నవ్వుల పాలయ్యాడు. ఎందుకంటే ఆ ప్లకార్డు పట్టుకున్నది ఆ నగర మేయర్‌. పైగా తనకు వ్యతిరేకంగా తీస్తున్న ఆ ర్యాలీలో చాలా అమాయకంగా వారి మధ్యకే వెళ్లి ప్లకార్డు పట్టుకుని మరీ అభాసుపాలయ్యాడు. ఆ ర్యాలీ నిర్వహించిన వారు వేరే పట్టణాల నుంచి రావడంతో ఆ నగర మేయర్‌ ఎలా ఉంటాడో వారికి తెలియకపోవడంతో ఎంచక్కా మేయర్‌ ముందే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top