అంతరిక్షం నుంచి కనిపించేలా ‘మండేలా’

అంతరిక్షం నుంచి కనిపించేలా ‘మండేలా’


జొహాన్నెస్‌బర్గ్‌: జాతివివక్ష వ్యతిరేకోద్యమ నేత నెల్సన్‌ మండేలా శతజయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా జైళ్లలోని వందలాది ఖైదీలు ప్రపంచంలోనే అతిపెద్ద ముఖచిత్ర దుప్పటితో(4,500 చదరపు మీటర్లు) నివాళి అర్పించనున్నారు.


ఈ చిత్రాన్ని ఊలు దారాలతో అల్లుతారు. వచ్చే ఏడాది జూలై 18(మండేలా శతజయంతి) కోసం  చిన్నచిన్న ఊలు దుప్పట్లను కలిపికుట్టి ఈ భారీ దుప్పటిని తయారుచేస్తారు. దీన్ని అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చు. బ్లాంకెట్స్‌ ఫర్‌ మండేలా అనే సంస్థ ‘మాసివ్‌ మండేలా మాస్టర్‌పీస్‌’ పేరుతో ఈ ప్రాజెక్టును శనివారం జోండర్‌వాటర్‌ జైల్లో ప్రారంభించింది. దుప్పట్లకు అవసరమయ్యే ఊలు ఖర్చు రూ. 6.6 కోట్లను ఓ అజ్ఞాత వ్యాపారి భరిస్తున్నారు.

Back to Top