డబ్బు ఆదా కోసం చూస్తే.. పేలిన ఫోన్‌..!

Phone Bursts After Man Tries To Replace Battery To Save Money - Sakshi

చైనా : డబ్బు ఆదా కోసం సొంతంగా స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని మార్చాలని ప్రయత్నించిన ఓ వ్యక్తికి భారీ అపాయం తప్పింది. కొత్త బ్యాటరీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్‌లో సెట్‌ చేయిచడం కోసం మొబైల్‌ షాపునకు వెళ్లాడు. అయితే, బేరం కుదరకపోవడంతో సొంతంగా బ్యాటరీని మార్చేందుకు యత్నించాడు.

బలవంతంగా బ్యాటరీని తీయడానికి యత్నించడంతో ఫోన్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మొబైల్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో షాపులోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయిన ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top