స్పీకర్‌కు పాజిటివ్‌.. పాక్‌ ప్రధానికి కరోనా భయం

Pakistans National Assembly Speaker test Corona positive - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖురేషీ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. ఇదిలావుండగా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కరోనా భయం వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన అసద్‌.. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ కలవడం దీనికి కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్‌ ఎవరెవరిని కలిశారు అనేది గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆయనకు దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. (రష్యా ప్రధానికి కరోనా)


కాగా ఇమ్రాన్‌కు ఇదివరకే ఓసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్‌లో 16,353  కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. పవిత్ర రంజాన్‌ మాసం కావడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. (పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా పరీక్షలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top