పాకిస్తాన్‌ ఒంటరి అవుతోంది

Pakistan international isolation

ప్రధాని ప్రసంగంపై మాజీ హై కమిషనర్‌ అసంతృప్తి

భారత్‌, ఆఫ్ఘన్‌లతో సంబంధాలు అవసరం

బలూచ్‌ విషయాన్ని భారత్‌ ప్రస్తావిస్తే...

ఇస్లామాబాద్‌ : అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్‌ ఒంటరిగా మారుతోందని ఆ దేశ మాజీ హై కమిషనర్‌ హుస్సేన్‌ హక్కానీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ చేసిన వ్యాఖ‍్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇటువంటి పరిపక్వతలేని మాటల వల్ల ప్రపంచంలో పాకిస్తాన్‌ ఒంటరి దేశంగా మిగిలిపోయే ప్రమాదముందని హక్కానీ హెచ్చరించారు. హక్కానీ 2008-11 వరకూ అమెరికాలో పాకిస్తాన్‌ హై కమిషనర్‌గా పనిచేశారు.

పాకిస్తాన్‌కు సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌లతో సృహృద్భావపూరిత సంబంధాలు చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. కశ్మీరీలపై భారత్‌ అకృత్యాలు, అరాచకాలు చేస్తోందని చెప్పడం కన్నా.. కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘం నుంచి ఒక బృందాన్ని కశ్మీర్‌కు పంపమని కోరితే బాగుండేదని చెప్పారు. మానవ హక్కుల సంఘం ఇచ్చిన నివేదకపై ఐక్యసమితిని నిర్ణయం తీసుకోమని కోరడం మంచి ఆలోచన అని చెప్పారు. భారత్‌ కూడా పాకిస్తాన్‌లో.. బలూచిస్తాన్‌ సమస్యను సమితిలో ఇలాగే ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేని స్థితిలోకి పాక్‌ వెళ్లడం ఖాయమని హక్కానీ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top