భార్యాభర్తల పంచాయితీ ‘నింగి’ని తాకింది..!!

Nasa Astronaut Accessed Estranged Wife Private Financial Records - Sakshi

వాషింగ్టన్‌ : ఇంట్లో మొదలైన పంచాయితీ వీధిలోకి.. అక్కడి నుంచి రచ్చబండపైకి చేరడం చూశాం. కానీ, అమెరికాలోని ఓ జంట పంచాయితీ మాత్రం అంతరిక్షం వరకు వెళ్లింది. నాసా (అ​మెరికా అంతరిక్ష సంస్థ)లో పనిచేసే ఆస్ట్రోనాట్‌ అన్నె మెక్లెయిన్‌ తన భార్య సమ్మర్‌ వోర్డెన్‌తో విభేదాలు రావడంతో విడిగా ఉంటోంది. ఇద్దరూ స్త్రీలైనా వీరు భార్యాభర్తలుగా కొనసాగడం గమనార్హం. నాసా స్పేస్‌ మిషన్‌లో భాగంగా మెక్లెయిన్‌ ఆరు నెలలపాటు అంతరిక్షంలో గడిపింది. ఆ సమయంలో తన భార్య బ్యాంకు లావాదేవీలను అక్రమంగా తెలుసుకుంది. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్నప్పుడు తన కంప్యూటర్‌లోకి మెక్లెయిన్‌ చొరబడి ఆర్థిక లావాదేవీలు తెలుసుకుందని ఆమె భార్య సమ్మర్‌ వోర్డెన్‌ ఆరోపించారు.

ఈ మేరకు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే, ఎఫ్‌టీసీ తన ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆమె వాపోయారు. ఇక వోర్డెన్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నాసా అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. అయితే, ఇద్దరూ కలిసున్నప్పుడు చేసిన లావాదేవీలను తెలుసుకునేందుకే మెక్లెయిన్‌ అలా చేసిందని ఆమె తరపు న్యాయవాది చెప్తున్నాడు. మొత్తంమీద భూమి నుంచి ఆకాశానికి తాకిన ఈ పంచాయితీ మొట్టమొదటిదిగా నిలిచిపోనుంది. నేరం నిరూపణ అయితే మెక్లెయిన్‌పై క్రిమినల్‌ కేసు నమోదయ్యే అవకాశం ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top