ప్రఖ్యాత ‘మాస్టర్‌ చెఫ్‌’ నుంచి ఆ ముగ్గురు వైదొలిగారు

MasterChef Australia Judges Dispute On Over Pay - Sakshi

సిడ్ని: ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత టెలివిజన్‌ ఛానెల్‌ నిర్వహించే ‘మాస్టర్‌ చెఫ్‌’  కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే మాట్ ప్రెస్టన్, గ్యారీ మెహిగాన్, జార్జ్ కలోంబారిస్‌లు ఈ కార్యక్రమం నుంచి వైదొలిగారు. ఈ కార్యక్రమ నిర్మాతలు వీరికి మంగళవారం జరిగిన సీజన్‌ చివరిదని పేర్కొన్నారు. కాగా ఈ వంటల కార్యక్రమానికి ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జడ్జ్‌ జార్జ్‌ కలోంబారిస్‌ తన రెస్టారెంట్‌లోని సిబ్బందికి తక్కువ వేతనలు చెల్లించడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై కోర్టు ఆయనపై దాదాపు 2 లక్షల ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే కార్యక్రమం నుంచి ఆయన వైదొలినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక రెమ్యూనరేషన్‌ విషయమై యాజమాన్యంతో భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఆయనతో పాటు మరో ఇద్దరు జడ్జీలు కూడా ఈ కార్యక్రమానికి వీడ్కోలు పలికినట్లు సమాచారం. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న కారణంగా ఇప్పటికే ఒక్కొక్కరు మిలియన్‌ డాలర్ల పారితోషికం పొందుతున్నారని.. ఇక తదుపరి సీజన్లకు ఇందులో మరో 40 శాతం అదనంగా చెల్లించాల్సిందిగా కోరగా... కార్యక్రమ నిర్మాతలు ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

కాగా ఈ విషయం గురించి మాట్‌ ప్రెస్టన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఈ మేరకు..‘ 11 ఏళ్ల పాటు మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణాన్ని మేము ఆస్వాదించాము’ అంటూ సహ జడ్జీలతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top