వైరల్‌: బొద్దింకలను చావగొట్టేందుకు వెళ్లి..

Man Blows Up Garden When Trying To Kill Bugs In Brazil - Sakshi

బొద్దింకల బెడద తొలగించుకోవాలని చూసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బొద్దింకల గూడును కాల్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో పచ్చని గార్డెన్‌ తునాతునకలైంది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... సీజర్‌ సీమిజ్‌(48) అనే వ్యక్తి భార్యతో కలిసి విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. అయితే వారి గార్డెన్‌లో భారీ సంఖ్యలో బొద్దింకలు చేరడంతో వాటిని చెదరగొట్టమని సీజర్ భార్య అతడికి సూచించింది. దీంతో గార్డెన్‌లోకి చేరుకున్న సీజర్‌ బొద్దింకల గూడుపై గ్యాసోలిన్‌ వేసి.. దానిని అగ్గిపుల్లతో అంటించేందుకు ప్రయత్నించాడు. అయితే అది కాస్తా బెడిసికొట్టి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. కానీ బొద్దింకలు మాత్రం చావలేదు. అంతేకాదు ఎంచక్కా అవి సీజర్‌ కాళ్ల గుండా పరుగులు పెడుతూ అతడికి చిరాకు తెప్పించాయి.

కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీజర్‌ ఇంటి సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘పాపం బొద్దింకలు చావలేదు. గార్డెన్‌ మాత్రం పాడైపోయింది. ఇప్పుడు ఆయన తన భార్యకు ఎలా సమాధానం చెబుతారో చూడాల్సిందే’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top