పిల్లికి ప్రేమతో..

Love on cat  - Sakshi

చాలా మందికి తమ పెంపుడు జంతువులంటే ప్రేమ. ఎంతగా వాటిని ఇష్టపడతారంటే.. వాటికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతారు.. ఇంట్లో మనిషి లాగే వాటినీ చూసుకుంటారు. అలా ఓ పెంపుడు పిల్లి కోసం తపన పడ్డ ఓ మహిళ కథే ఇది. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన బెస్టీ బోడ్‌ ఓ పార్ట్‌టైం ప్రొఫెసర్‌. భర్త, ఇద్దరు పిల్లలు, 17 ఏళ్ల స్టాన్లీ అనే పిల్లి.. వీరే ఆమె ప్రపంచం. అయితే ఓ రోజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న స్టాన్లీకి జబ్బు చేసింది.

చికిత్స అందించేందుకు చాలా ఆస్పత్రులు తిరిగింది. అయితే ఎక్కడా నయం కాలేదు. స్టాన్లీకి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి వచ్చిందని, బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. అయితే ఎలాగైనా బతికించుకోవాలని బెస్టీ ఎంతగానో తపించింది. ఆఖరికి స్టాన్లీ మూత్రపిండాలు ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తే బతికే అవకాశం ఉందని ఓ డాక్టర్‌ చెప్పారు. అందుకు దాదాపు రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా కంగారు పడ్డారు.

ఎందుకంటే ఏడాదికి రూ.30 లక్షలు సంపాదించే వారికి అంత మొత్తం అంటే 5 నెలల జీతం. అయినా సరే స్టాన్లీని బతికించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆపరేషన్‌ సక్సెస్‌.. ఇంకేముంది స్టాన్లీ హ్యాపీ.. బెస్టీ హ్యాపీ.. మొత్తం ఫ్యామిలీ హ్యాపీ..! ఓ పెంపుడు పిల్లి కోసం అంతఖర్చు చేయడం అవసరమా అని చాలా మంది అడిగిన ప్రశ్నలకు.. ‘స్టాన్లీ అంటే నాకు చాలా ఇష్టం.. దానికి కూడా నేనంటే అమితమైన ప్రేమ. రోజూ సాయంత్రం నేను ఎప్పుడు వస్తానా అని ఎదురుచూస్తూ ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top