కరోనా ప్రభావం చూపించేది ఇలా...

Lancet General Report On Covid 19 - Sakshi

కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన అయిదు రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత జ్వరం, గొంతు నొప్పి, జలుబుతో ప్రభావం మొదలవుతుంది.. ఒక్కోసారి లక్షణాలు బయటపడడానికి 14 రోజులు కూడా పడుతుంది. కరోనా వైరస్‌ శరీరంపై ప్రభావం చూపించడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఏయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ..

1–3 రోజులు
కరోనా వైరస్‌ శరీరంపై ప్రభావం చూపించగానే మొదట ఒళ్లు వెచ్చబడుతుంది. 
 గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి మూడో రోజు నుంచి కనిపిస్తాయి. 
కరోనా బాధితుల్లో లక్షణాలు ఇలా మొదలైన వారు: 80%

4–9 రోజులు 
మూడు నుంచి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి అందడం చాలా కష్టమవుతుంది. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా వస్తాయి.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారు : 14%

8–15 రోజులు
ఊపిరితిత్తుల నుంచి ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి చేరుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ప్రాణాంతకమైన సెప్సిస్‌ (బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌) ఒక వారం తర్వాత మొదలవుతుంది. అప్పట్నుంచి రెండు వారాల పాటు బాధితుల్ని కాపాడుకోవడానికి అత్యంత జాగరూకత అవసరం. ఇంటె న్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వారికి చికిత్స అందించాలి.
బాధితుల్లో ఈ పరిస్థితి వచ్చిన వారు : 5%

3 వారాల తర్వాత
♦ రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు కరోనాను జయించడం సులభమే. హైపర్‌ టెన్షన్, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధితో ఎక్కువ ముప్పు. 
కరోనా మృతుల శాతం : 3 నుంచి 4 శాతం 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top