బడికెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!

బడికెళ్లాలంటే సాహసం చేయాల్సిందే! - Sakshi


జకార్తా: ఇండోనేషియాలోని జావా అడవుల సమీపంలోవున్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే పిల్లలు ప్రతి రోజు పెద్ద సాహసమే చేయాలి. జావా అడవిలో నదిపై వేలాడుతున్న వంద అడుగుల పొడవైన సస్పెన్షన్ వంతెనను దాటాలి. బడికెళ్లాలంటే భయపడని పిల్లలు ఈ వంతెనను చూసి భయపడాల్సిందే. వంతెన మధ్య అరడుగు వెడల్పు ఉన్న కర్ర దుంగపై బాడీని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాలి. చాలా మంది పిల్లలు దాని మీదుగుండానే సైకిల్‌పై బడికెళ్లి వస్తుంటారు.



బడికెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గం లేదా అంటే, ఉంది. అది చుట్టూ తిరిగి ఐదారు కిలీమీటర్లు నడిచి, ఆ తర్వాత పడవలో నది దాటి వెళ్లాలి. అది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సమయం ఎక్కువ పడుతుంది కనుక పిల్లలు ఈ దారి గుండా వెళ్లేందుకే అలవాటు పడ్డారు. వంతెనపై కర్ర దుంగలు మరిన్ని అమర్చి దారిని కాస్త వెడల్పు చేయొచ్చుగదా అని అధికారులనడిగితే ఎప్పుడో కట్టిన ఆ వంతెన అంత బరువును మోయదట. పైగా బడికెళ్లి కష్టపడి చదువుకోవాలనుకునే పిల్లలు ఈ మాత్రం సాహసం చేయకపోతే ఎలా! అని కూడా ఉచిత సలహా ఇస్తున్నారు.



Indonesia,school,students,bridge, బడి, పాఠశాల, ఇండోనేషియా, జావా, విద్యార్థులు, బ్రిడ్జి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top