ట్రాఫిక్‌తో విసిగి ‘రూటు’ మార్చాడు

incident at traffic in China - Sakshi

విధులకు హాజరయ్యేందుకు ప్రతిరోజూ బస్సులో గంటల తరబడి కూర్చొని విసిగిపోయిన ఓ వ్యక్తి.. బస్సు దిగేసి, రోడ్లపై గీసిన ట్రాఫిక్‌ లైన్స్‌ను తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చేశాడు. ఈ ఘటన చైనాలోని షాంఘై సమీపంలోగల లియాన్‌యుంగాంగ్‌ నగరంలో జరిగింది. ఓ యువకుడు బస్సు దిగి రోడ్డుపైకి వచ్చి, రోడ్‌ లైన్లను రీపెయింట్‌ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

తన పూర్తిపేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ యువకుడు, ఇంటిపేరు ‘కై’గా మాత్రమే చెప్పాడు. ఇష్టమొచ్చినట్లుగా రోడ్‌ లైన్స్‌ను ఎందుకు మారుస్తున్నావని పోలీసులు ప్రశ్నించగా.. తింగరి సమాధానం చెప్పాడట. రోడ్లపై గీసిన స్ట్రెయిట్‌ లైన్‌ కారణంగా కార్లు, బస్సులు ఒకదాని వెనుక మరొకటి మెల్లగా వెళ్తున్నాయని, ఆ పక్కనే ఉన్న లైనంతా ఖాళీగా ఉంటోందని, అయినా ఆ మార్గంలో ఎవరూ వెళ్లడం లేదని చెప్పాడట. అందుకే స్ట్రెయిట్‌ లైన్‌కు అనుబంధంగా ఓ లెఫ్ట్‌ లైన్‌ను, ఓ రైట్‌ లైన్‌ను గీయడంతోపాటు అవసరమైతే వెనక్కు కూడా వెళ్లేలా మరో గీతను గీశానని చెప్పడంతో.. ఆశ్చర్యపోయిన పోలీసులు అతగాడికి 1,000 యువాన్‌ల జరిమానా విధించారట. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top