పనివాడి మెస్సేజ్‌ చూసి గుండె అదిరిపడింది


ఆస్ట్రేలియా: రోజూ మాదిరిగానే చంతల్‌ వాగన్‌ అనే మహిళ ఇంట్లోని తన జిమ్‌ గదిలోకి వెళ్లింది. సీలింగ్‌కు పెద్ద రంధ్రం పడటం గమనించింది. ఒక వేళ పిల్లలాంటి జంతువు సీలింగ్‌లోకి ప్రవేశించి కిందపడిపోయిందేమో అని అనుకొని తన పని తాను చేసుకొని వెళ్లిపోయింది. రెండు రోజుల తర్వాత ఇంటిని శుభ్రం చేసే వ్యక్తి ఆమె ఫోన్‌కు ఒక సందేశం పంపాడు. అది చూసి ఆమె గుండె ఝల్లుమంది. ఒంట్లో వణుకుపుట్టింది. ఇంతకీ ఆ మెస్సేజ్‌లో ఏం ఉందంటే..‘నేను మీ జిమ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు ఒక పెద్ద పామును చూశాను. అది అనకొండంత పెద్దగా ఉంది’ అని చెప్పాడు. అప్పుడుగానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. తన ఇంట్లోని సీలింగ్‌లోకి పాము దూరిందని, దాని బరువును సీలింగ్‌ ఆపలేకపోవడంతో రంధ్రం పడిందని. ఆ పాము మంగళవారం పడిందో గురువారం పడిందో నాకు తెలియదు. నేను ఇక్కడే వ్యాయామ పాఠాలు చెబుతుంటాను. అది ఎక్కడ దాక్కుందో కూడా నాకు తెలియదు. అది బాగా తిని ఉండటం వల్ల పట్టుకునేందుకు వచ్చినవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. దాని పొట్టలో పిల్లి ఉందని అనుకుంటున్నాను. ఆ విషయం దానిని చూస్తే మీకే అర్థమవుతుంది’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో పాము ఫొటోను వివరాలను పేర్కొంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని రాక్‌ హాంప్టన్‌ బోక్వా సీక్యూ జిమ్‌లో చోటుచేసుకుంది.

Back to Top