మొబైల్‌ వాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారా..?

మొబైల్‌ వాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారా..?


   మొబైల్‌లో తలపెడితే ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారా..? రోడ్డుపై నడిచేటప్పుడు.. డ్రైవింగ్‌ చేసేటప్పుడు.. మొబైల్‌లో లీనం అవుతున్నారా..? అయితే ఈ వీడియో చూడండి తప్పకుండా రియలైజ్‌ అవుతారు.. డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌ వాడటం.. రోడ్డుపై నడుస్తూ చాట్ చేయడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కళ్లకు కట్టేలా దక్షిణాఫ్రికా పశ్చిమ కేప్ ప్రభుత్వం 40 సెకన్ల యాడ్‌ను రూపొందించింది.


రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ‘సేఫ్లీ హోమ్‌‌’  కార్యాక్రమంతో ఈ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మిలియన్ల వ్యూస్‌ అందుకున్నఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.  మొబైల్‌లో లీనమై నడుస్తూ ప్రమాదానికి గురైన సంఘటనలు, డ్రైవింగ్ చేస్తూ టెక్ట్స్‌ మెసెజ్‌లు పంపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యాలను వీడియోలో పొందుపరిచింది. ఇంకెందుకు ఆలస్యం మీరు వీడియో చూడండి జాగ్రత్తగా ఉండండి.

Back to Top