‘మా డాడీ అనుకున్నారా.! నా బోయ్‌ ఫ్రెండ్‌’

he is not my dad..but my boy friend - Sakshi

ఆమెకు 21, ఆయనకు 64. ఓ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా పరిచయం అయ్యారు. అతడు ఎంతో ధైర్యం చేసి పలుమార్లు తనలో తాను తటపటాయించుకొని ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పడేశాడు. దానికి ఆ అమ్మాయి ఆకర్షితురాలై ఫ్రెండ్‌గా ఓకే చేసింది. అనంతరం చాటింగ్‌.. కబుర్లు.. చూడకుండా ఉండలేనంత ఫీలింగ్‌ చివరకు కలిశారు ప్రేమికులయ్యారు. అయితే వారిని చూసిన వారంతా తండ్రి కూతుళ్లు అని భ్రమపడుతున్న ప్రతిసారి వారు మాత్రం పగలబడి నవ్వుకుంటున్నారంట. ఆ వివరాలు ఓసారి పరిశీలిస్తే.. అలెగ్జాండ్రియా గేటాన్‌ గుటిరెజ్‌ (21) అనే యువతిది టెక్సాస్‌. ఆమె ఓ కాలేజీలో చదువుతోంది. ఫేస్‌బుక్‌లో తాను క్రియేట్‌ చేసుకున్న గ్రూప్‌ పేజీలో నిత్యం చాటింగ్‌లో ఉంటుంది.

అలా ఉండగా ఆమెకు 19 ఏళ్లు ఉన్న సమయంలో సరిగ్గా 1600 మైళ్ల దూరంలో ఉన్న జోనాథన్‌ జెఫ్‌నర్‌(64) అనే వ్యక్తి ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించగా ఆమె ఓకే చెప్పింది. తొలుత సాధారణంగానే సాగిన వారిద్దరి సంబంధం రోజులు గడుస్తున్న కొద్ది మరి దగ్గరైంది. అతడి ప్రవర్తనను విశ్లేషించిన అలెగ్జాండ్రియా అనూహ్యంగా అతడికి లవ్‌ ప్రపోజ్‌ చేసింది. దాంతో షాక్‌ తిన్న అతడు తొలుత తాను సరిపోనని వద్దన్నాడు. అయితే, ఈ అంశంపై ఇరువురి మధ్య చర్చ తీవ్రంగానే జరిగింది. పైగా అతడు అప్పటికే తన భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా అతడికి ఓ ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అలెగ్జాండ్రియా తల్లిదండ్రులు కూడా అతడికంటే చిన్నవారే. ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసుకున్న వీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోవడంతో నేరుగా జోనాధన్‌ ఫ్లైట్‌ ఎక్కి అలెగ్జాండ్రియా చదువుకుంటున్న కాలేజీకి వచ్చేశాడు. తొలుత దూరం పాటించి గడిపినా కొన్ని గంటల్లోనే వారిద్దరి మధ్య చనువు పెరిగి ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. తొలుత వీరిద్దరి చూసిచూడనట్లు వ్యవహరించిన ఆమె తల్లిదండ్రులు ఆ తర్వాత వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన కాలేజీలో చదువుకుంటుండగా ఆయన తన పనిలో నిమగ్నమై ఇరువురి మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వారిని కలిపిన ఫేస్‌బుక్‌ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top