‘హెచ్‌–1బీ’తో ఒకటికి మించి!

H1B visa workers may work for more than one employer - Sakshi

ఏకకాలంలో అనేకచోట్ల పనిచేయొచ్చు: యూఎస్‌  

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసా కలిగిన ఉద్యోగులు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేయొచ్చని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. అయితే ఆ ఉద్యోగి పనిచేసే ప్రతి కంపెనీ కూడా అతనికి సంబంధించిన ఐ–129 పత్రాన్ని తమకు సమర్పించేలా చూసుకోవాలంది. సాధారణంగా అమెరికా కంపెనీలు విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేటప్పుడు ఆ వివరాలను తెలుపుతూ ఐ–129 పత్రాన్ని యూఎస్‌సీఐఎస్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

ఇలా ఉద్యోగి ఎన్ని కంపెనీల్లో పనిచేస్తుంటే అన్ని కంపెనీలూ అతనికి సంబంధించిన ఐ–129 పత్రాన్ని సమర్పించాలని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. ఈ నిబంధన పాతదే అయినప్పటికీ దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. సాధారణంగా ప్రతి ఏడాదీ 65 వేల హెచ్‌–1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటికి అదనంగా మరో 20 వేల హెచ్‌–1బీ వీసాలను అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చదివిన విదేశీయులకు కేటాయిస్తుంది. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలు తదితర లాభాపేక్ష లేని రంగాల్లో పనిచేయాలనుకునే వారికి కూడా ఈ 65 వేల పరిమితితో సంబంధం లేకుండా హెచ్‌–1బీ వీసాలు లభిస్తాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top