బలూచిస్థాన్‌లో నరమేధం

Gunmen kills 14 passengers in Balochistan - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో 14 మందిని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సులను కొంతమంది దుండగులు ఆపారు. ఆ తర్వాత బలూచిస్థాన్‌కు చెందని 14 మంది నౌకాదళ, తీర ప్రాంత సిబ్బందిని కిందకు దింపారు. అనంతరం తాళ్లతో చేతులు కట్టేసి వారిని మరోచోటుకు తీసుకెళ్లి కాల్చి చంపారు. ఈ ఘటన మక్రన్‌ కోస్టల్‌ హైవేపై చోటుచేసుకుంది. 

ఈ దారుణానికి పాల్పడింది బలూచిస్థాన్‌ వేర్పాటువాదులే అని తెలుస్తోంది. దుండగులు మిలటరీ దుస్తుల్లో వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్‌ పాకిస్థాన్‌లోని ప్రావీన్స్‌లలో వైశాల్యంలో పెద్దది కాగా, చాలా వెనకబడిన ప్రాంతం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top